ఫ్యూచర్ ప్లాన్స్ చెప్పిన పూరి జగన్నాథ్

Puri-Jagannadh

డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాకి మిక్సుడ్ రెస్పాన్స్ వస్తుండడంతో తను చాలా సంతోషంగా వున్నాడు. ఈ డైరెక్టర్ తన సినిమాని జేమ్స్ కామేరోన్స్ సినిమా ‘అవతార్’తో పోల్చాడు. ‘ అవతార్ సినిమా విడుదలయినప్పుడు అందరు అందులోని విచిత్రమైన వేశాదరణ గురించి కామెంట్స్ చేశారు. కానీ అది విజయాన్ని సాదించలేదా? ఇది కూడా అలాంటిదే ‘ అని అన్నారు. ఈయన ఈ మాటలని నిన్న జరిగిన ప్రెస్ మిట్ లో అన్నారు. అలాగే తన బావిషత్తు ప్రణాలికలను కూడా తెలియజేశాడు. ‘ నేను మహేష్ బాబు తో ఒక రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాని తీయాలనుకుంటున్నాను. బన్నీ తో మరోసారి పనిచేయలనుకుంటున్నాను. అలాగే ప్రభాస్ తో కూడా చేయాలి. ఈ మూడు సినిమాలు చేయాలి. వీటితో పాటు కొన్ని సినిమాలను బాలీవుడ్ లో తీసే ప్లాన్స్ కూడా వున్నాయి. ‘ఇడియట్’, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ లను రీమేక్ చేయాలి’ అని అన్నాడు.

పూరి జగన్నాథ్ తెలుగు సినిమా ప్రేక్షకులను మరోసారి కామెంట్స్ చేశారు. ‘ ఒకప్పుడు ప్రేక్షకులు సినిమాలో స్టోరీ ఏమి లేదు అనేవారు. కానీ సెకండాఫ్ లో కథ ప్రారంభం కాగానే బోర్ వస్తుంది అంటున్నారు.’ అని అన్నాడు.
మీరు ఈ మాటలని ఒప్పుకుంటున్నారా ఫ్రెండ్స్? మీ కామెంట్స్ ని క్రింద రాయండి.

Exit mobile version