విష్ణు మంచు హీరోగా వీరు పోట్ల దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘దూసుకేళ్తా’. ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఈ రోజు హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. ఈ సినిమాలో విష్ణు సరసన అందాల రాక్షసి ఫేం లావణ్య హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలోని కొన్ని పాటలను ఈ మద్య స్లోవేనియా షూట్ చేశారు. తరువాత ఈ సినిమా టీం కొద్దిరోజుల విశ్రాంతి తీసుకోవడం జరిగింది. ఈ సినిమాని 24 ఫ్రేమ్స్ బ్యానర్ పై మోహన్ బాబు నిర్మిస్తున్నాడు. చాలా రోజుల తరువాత మంచి హిట్ సాదించిన ‘దేనికైనా రెడ్డి’ సినిమా తరువాత వస్తున్న ఈ సినిమాపై విష్ణు చాలా నమ్మకంగా ఉన్నాడు. వీరు పోట్ల కామెడీ ఎంటర్టైనర్ సినిమాలను నిర్మిస్తాడన్నా విషయం మనందరికి తెలుసు. ప్రస్తుతం విష్ణు ఈ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవలనుకుంటున్నాడు.