జూన్ 14న కిస్ ఆడియో

Kiss
అడివి శేష్, ప్రియ బెనర్జీ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న ‘కిస్’ సినిమా ఆడియో జూన్ 14న విడుదల కానుంది. శేష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని మై డ్రీం సినిమా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై సాయి కిరణ్ అడివి నిర్మిస్తున్నాడు. ఇటీవలే విడుదల చేసిన టైటిల్ ట్రాక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకి శేష్ – సాయి కిరణ్ సంయుక్తంగా కథని రాసారు. ఈ సినిమాకి ‘కీప్ ఇట్ సింపుల్ స్టుపిడ్’ అనేది ఉపశీర్షిక. ఈ సినిమా మొత్తాన్ని కాలిఫోర్నియా, సాన్ ఫ్రాన్సిస్కో లో షూట్ చేసారు. ఇప్పటి వరకూ లవ్ లో పడని ఓ 20 ఏళ్ళ అమ్మాయి హీరోని కలిసి ప్రేమలో పడ్డాక ఆమె లైఫ్ ఎలా మారింది అనేదే ఈ కథాంశం. ‘కర్మ’ సినిమా తర్వాత అడివి శేష్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాతో ఆడియన్స్ అందరూ ఎంటర్టైన్ అవుతారని ఎంతో నమ్మకంగా ఉన్నాడు. శ్రీ చరణ్ పాకల – పెటె వండర్ సంగీతం అందించగా శనియెల్ డియో సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.

Exit mobile version