రవితేజ చేయాల్సిన సినిమాలో మహేష్ బాబు.!

Mahesh-in-Pokiri
‘పోకిరి’ అనగానే మనకు గుర్తొచ్చేది 75 ఏళ్ళ తెలుగు సినిమా రికార్డుల్ని తిరగరాయడమే కాకుండా, సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో బ్లాక్ బస్టర్ హిట్. కానీ ఈ రోజు ఈనాడు పేపర్లో ముందుగా ఈ సినిమా రవితేజ చేయాల్సిందనే కథనాన్ని తెలిపారు. ముందుగా పూరి జగన్నాథ్ ఈ సినిమాని రవితేజ – పార్వతి మెల్టన్ లతో చిత్రీకరించాలనుకున్నారు. అప్పట్లో ఈ సినిమాకి ‘ఉత్తమ్ సింగ్ సన్ ఆఫ్ సూర్యనారాయణ’ అనే టైటిల్ ని ఖరారు చేసారు.

కానీ అది అనుకోకుండా మారిపోయి మహేష్ బాబు హీరోగా ‘పోకిరి’ సినిమాగా మన ముందుకు వచ్చింది. అలాగే ఇలియానాని కూడా పార్వతి మెల్టన్ స్థానంలో చివరి నిమిషంలో ఎంచుకున్నారు. చూస్తుంటే రవితేజ లాస్ మహేష్ బాబుకి సక్సెస్ తెచ్చిపెట్టినట్టుంది. పార్వతి మెల్టన్ మాత్రం ‘పోకిరి’లో నటించి ఉంటే టాప్ హీరోయిన్స్ ప్లేస్ లోకి వెళ్లి ఉండేది.

Exit mobile version