రామ్ చరణ్ నటిస్తున్న ‘ఎవడు’ సినిమా షూటింగ్ చివరి దశలో వుంది. శృతిహాసన్ మరియు ఎమీ జాక్సన్ హీరోయిన్స్. గతవారం ముగిసన షెడ్యూల్లో రామ్ చరణ్ శృతి హాసన్ సరసన స్విట్జర్ లాండ్ దగ్గర జర్చ్ లో చిత్రీకరించారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా హైదరాబాద్లో మే 29నుండి కొత్త షెడ్యూల్ ప్రారంభించనున్నారు. ఈ షెడ్యూల్ లో హీరోతో పాటు, ఇద్దరు హీరోయిన్స్ కూడా పాల్గున్నారు. ఈ సినిమా జూన్ 20తో ముగియనుంది. ఈ సినిమా దిల్ రాజు నిర్మాణంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్లో అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో యాక్షన్ సీన్లను రామ్ చరణ్ అద్బుతంగా నటించాడని సమాచారం. ఈ సినిమా జూలైలో మన ముందుకు రానుంది.