“విశ్వంభర” రిలీజ్ పై సాలిడ్ బజ్.. ఆ స్పెషల్ డేట్ లోనే

మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇపుడు యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు వశిష్ఠ కాంబినేషన్ లో భారీ ఫాంటసీ చిత్రం “విశ్వంభర” చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం కోసం అభిమానులు ఎప్పుడు నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా నిజానికి ఈ చిత్రం ఈ జనవరి సంక్రాంతి బరిలోనే రిలీజ్ కావాల్సి ఉంది.

కానీ పలు కారణాలు చేత సినిమాని వాయిదా వేయగా ఇపుడు ఫైనల్ గా ఈ సినిమా రిలీజ్ కోసం సాలిడ్ బజ్ వినిపిస్తుంది. దీనితో మెగాస్టార్ కి స్పెషల్ డేట్ అయినటువంటి మే 9నే ఈ చిత్రం ఉండొచ్చని మళ్ళీ రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ డేట్ లోనే చిరు మరో ఫాంటసీ వండర్ “జగదేక వీరుడు అతిలోక సుందరి” కూడా వచ్చిన డేట్ అదే.

దీనితో ఈ డేట్ లోనే విశ్వంభర కూడా వస్తుంది అని ఆ మధ్య టాక్ వచ్చింది. అయితే ఇపుడు మళ్ళీ ఇదే డేట్ పై బజ్ మొదలైంది. దీనితో విశ్వంభర ఈ డేట్ లోనే రావచ్చని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Exit mobile version