రాముడి పై ఎన్నో భక్తీ పాటలను రచించిన ప్రముఖ వాగ్గేయకారుడు ‘త్యాగయ్య’ జీవిత కథను ఆదారంగా చేసుకొని లలితశ్రీ కంబైన్స్ పథకం పై ఆర్.వి. రమణ మూర్తి ‘శ్రీ త్యాగరాజు’ అనే సినిమాను నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. సంగీతమే ప్రదానం నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రఖ్యాత నృత్య సంకీర్తనాచార్యులు జె.ఈశ్వరప్రసాద్ త్యాగరాజు పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలోని పాటలకు ఈ మధ్యే ప్రణతి ఆడియో ల్యాబ్ లో రికార్డింగ్ జరిగింది. ఈ సినిమాకి కర్ణాటక సంగీత విద్వాంసుడు శ్రీ వైజర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాను నిర్మిస్తున్న నారాయణ మూర్తి మాట్లాడుతూ త్యాగరాజు లాంటి గొప్ప వాగ్గేయ కారుడి జీవిత చరిత్రను సినిమా తీయడం నా అదృష్టంగా భావిస్తున్నానని అన్నాడు.