టాలెంటెడ్ హీరో శర్వానంద్ మంచి ఇంటరెస్టింగ్ సినిమాలను తీసి టాలీవుడ్ లో మంచి స్థానాన్ని సంపాదించుకున్నాడు. తను చివరిగా నటించిన సినిమా ‘కో అంటే కోటి’ బాక్స్ ఆఫీసు వద్ద ఆశించినంత విజయాన్ని సాదించలేకపోయింది. ఈ సినిమాని శర్వానంద్ స్వయంగా నిర్మించాడు. ఇప్పుడు శర్వానంద్ రాంగోపాల్ వర్మ ‘సత్య-2’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా విజయం సాదిస్తుందని శర్వానంద్ చాలా నమ్మకంగా ఉన్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా హిట్ లేని రాంగోపాల్ వర్మ కూడా ఈ సినిమా విజయంపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాతో పాటుగా శర్వానంద్, నిత్యా మీనన్ తో జంటగా ‘ఏమిటో ఈ మాయ’ సినిమాలో నటిస్తున్నాడు.