ఖరారైన ఎన్.టి.ఆర్ ‘రామయ్యా వస్తావయ్యా’ రిలీజ్ డేట్

Ramayya-Vasthavayya2

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటిస్తున్న ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా సెప్టెంబర్ లో రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది. ఈ సినిమాని సెప్టెంబర్ 27న రిలీజ్ చేయనున్నారు. గతంలో ఇదే రోజు ఎన్.టి.ఆర్ నటించిన ‘స్టూడెంట్ నెం.1’ సినిమా విడుదలైంది. హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.

సమంత, శృతి హాసన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ పవర్ఫుల్ స్టూడెంట్ లీడర్ పాత్రలో కనిపించనున్నాడు.

Exit mobile version