సాహసంలో తాప్సీ పాత్ర ఆదేనట

Taapsee
చంద్రశేఖర్ యేలేటి సరికొత్త సినిమా ‘సాహసం’ విడుదలకు సిద్దంగావుంది. గోపీచంద్ మరియు తాప్సీ ఈ యాక్షన్ అడ్వెంచర్లో ముఖ్యపాత్రధారులు. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. ఇప్పటికే గోపీచంద్ పాత్రను బయటపెట్టారు. ఈ సినిమాలో హీరో సరిహద్దుల్లో వున్నతన వంశపారంపర్య సంపదను కాపాడుకోవడానికి వెళ్ళే సెక్యూరిటీ గార్డ్ గా కనిపించనున్నాడు. ఇటీవలే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చంద్రశేఖర్ యేలేటి సినిమాలో తాప్సీ పాత్రగురించి వివరించాడు “ఇందులో ఆమె పాత్ర ఆసక్తికరంగా వుంటుంది. ప్రపంచంలో పాపలు ఎక్కువైపోయి ఈ ప్రపంచమంతా రెండేళ్లలో అంతమైపోతాది అని భావించే పాత్ర. ఆమెలో ఒక రకమైన భయం ఎప్పటికీ కొనసాగుతూనేవుంటుంది. ఆమె హీరోని కలవడం అతనితో ప్రయాణం చేసే విధానం ఆసక్తికరంగా వుంటుందని” దర్శకుడు చెప్పారు. శ్రీ సంగీతం అందించాడు. షందాత్ సినిమాటోగ్రాఫర్.

Exit mobile version