మొదలైన మనోజ్-శ్రీవాస్ సినిమా

manchu-monoj
శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ సినిమా షూటింగ్లో మంచు మనోజ్ పాలుపంచుకున్నాడు. ఈ సినిమాలో మోహన్ బాబు, మంచు విష్ణు, రవీనా టండాన్, హన్సిక, ప్రణీత సుభాష్, తనీష్, వరుణ్ సందేశ్ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ స్లోవనియా లో ప్రారంభమయ్యి విష్ణు, హన్సిక నడుమ పాటకోసం ఇటలీ వెళ్ళారు. ఇప్పుడు స్లోవనియాలో తీయనున్న ఒక పాట కోసం మనోజ్ షూటింగ్లో పాల్గుంటున్నాడు. “నాన్న సినిమాలో పాట చిత్రీకరణ మొదలుపెట్టాం 🙂 చలి పుట్టించే ప్రదేశంలో షూటింగ్ చెయ్యడం ఇదే మొదటిసారి:… ) యూరోప్ స్లోవనియా ” అని ట్వీట్ చేసాడు. ఈ సినిమా కోసం ఎం.ఎం కీరవాణి, అచ్చు, బాబా సెహగల్ మరియు బప్పా లహరి సంగీతం అందించనున్నారు.

Exit mobile version