జూన్ నుండి మొదలుకానున్న అక్కినేని వారి మల్టీ స్టారర్

ANR,-Nagarjuna-and-Naga-Cha
ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న అక్కినేని వంశం నటిస్తున్న మల్టీ స్టారర్ సినిమా జూన్ మొదటి వారం నుండి మొదలుకానుంది. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య నటిస్తారు. ఈ సినిమా పేరు ‘మనం’. విక్రమ్ కుమార్ దర్శకుడు.

నాజర్జున, నాగ చైతన్య లకు జంటగా శ్రియ శరన్, సమంతలను ఖరారు చేసారు. ‘గుండెజారి గల్లన్తయ్యిందే’ సినిమాకు మాటలు అందించిన హర్షవర్ధన్ ఈ సినిమాకి కుడా తన కలం పదును చూపనున్నాడు. అనూప్ రుబెన్స్ సంగీతం అందిస్తాడు.
ఈ సినిమా ఒక భారీ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుందని అంచనా. నాగార్జున ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

Exit mobile version