పూర్తయిన తుఫాన్ షూటింగ్

Thoofan
రామ్ చరణ్ బాలీవుడ్లో నటిస్తున్న మొదటి సినిమా ‘జంజీర్’ షూటింగ్ ముగించుకుంది. ఈ సినిమా తెలుగు వెర్షన్ ‘తుఫాన్’. అపూర్వ లిఖియ ఈ సినిమా దర్శకుడు. దర్శకుడు యోగి తెలుగు వెర్షన్ ను పర్యవేక్షిస్తున్నాడు. రామ్ చరణ్ సరసన ప్రియాంక చోప్రా కనిపిస్తుంది. కధనాల ప్రకారం రామ్ చరణ్, ప్రియాంక చోప్రా, ప్రకాష్ రాజ్, సంజయ్ దత్ ఆఖరి రోజు చిత్రీకరణలో పాల్గున్నారు. తెలుగులో సంజయ్ పాత్రను శ్రీ హరి పోషిస్తున్నాడు. ఆయిల్ మాఫియా నేపధ్యంలో సాగే ఈ సినిమాలో రామ్ చరణ్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించాడు. సినిమా నిర్మాతలు ఈ చిత్రం అమితాబ్ నటించిన అప్పటి ‘జంజీర్’ కు సీన్ టు సీన్ రీమేక్ కాదని, వాస్తవీకరణకు అనుగుణంగా మార్పులు చేసామన్నారు. త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టబోతున్న ఈ సినిమా విడుదల తేదిని తరువాత ప్రకటిస్తారు.

Exit mobile version