మూడు భాషల్లో విడుదలకానున్న పవిత్ర

Pavitra (8)
శ్రియ నటిస్తున్న ‘పవిత్ర’ సినిమా భారీ రీతిలో విడుదలకు సిద్దంగావుంది. జనార్ధన్ మహర్షి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఒక వేశ్య, రాజకీయ నాయకుల ద్వారా తనకు జరిగిన అవమానానికి ప్రతీకగా వారినే ఎలా ఓడిస్తుంది అన్న కధాంశంతో తెరకెక్కిన కధ. గత నెల వైజాగ్ లో భారీ రీతిలో విడుదల చేసిన ఆడియోకు మంచి స్పందన రావడంతో చిత్ర వర్గం ఆనందంగా వున్నారు. ఈ విజయానికి గుర్తుగా మే 19న ప్లాటినం డిస్క్ ఫంక్షన్ నిర్వహించనున్నారు.

ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ “ఒక వనిత జీవన స్థితిని తెలిపే సినిమా ఇది. నాకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. వారితో కలిసి సినిమా చూడటానికి నేనేమాత్రం సంకోచించలేదు. సినిమాలో అసభ్యతకు తావులేదు. శ్రియ ఈ సినిమాలో అద్బుతమైన నటన కనబర్చిందని “అన్నారు. సాధక్ కుమార్ – సాయి మహేశ్వర్ రెడ్డి సంయుక్తంగా సినిమాను నిర్మించారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా త్వరలో తెలుగు, తమిళ, మళయాళ బాషలలో విడుదలకానుంది. తమిళ వెర్షన్ పేరు ‘పెరు మాత్రుమ్దాన్ పవిత్ర’ కాగా మళయాళ వెర్షన్ కు గాను తెలుగు టైటిల్ నే ఉంచారు.

Exit mobile version