త్వరలోనే స్వీడన్ వెళ్లనున్న ‘నేనేం చిన్నపిల్లనా?’ టీం

Suni-Kumar-Reddy
పి సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో రానున్న ‘నేనేం.. చిన్నపిల్లనా?’ సినిమా షూటింగ్ త్వరలో స్వీడన్ లో జరగనుంది. రాహుల్ రవీంద్రన్, మాజీ మిస్ ఇండియా తన్వి వ్యాస్ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై డా డి రామానాయుడు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని ఎక్కువ భాగాన్ని హైదరాబాద్, వైజాగ్, కారంచేడు ప్రాంతాల్లో చిత్రీకరించారు. వచ్చే నెలలో రాహుల్ రవీంద్రన్ పై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను తీయడానికి స్వీడన్ వెళ్తున్నారు. ఒక గ్రామంలో పెరిగిన అమ్మాయి జీవితం సిటీ కి వచ్చిన తర్వాత ఎలా మారింది అనేదే ఈ సినిమా కథాంశం. ఎంఎం శ్రీ లేఖ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి సబు జేమ్స్ సినిమాటోగ్రాఫర్. ‘సొంతఊరు’, ‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ’ సినిమాల తర్వాత సునీల్ కుమార్ రెడ్డి కాస్త రూటు మార్చి కమర్షియల్ ఫార్మాట్ లో ఈ సినిమా చేస్తున్నాడు.

Exit mobile version