సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సంపూర్నేష్ బాబు

sampoo
అతను సినిమా ఫ్యామిలీ నుండి రాలేదు, అతని మొదటి సినిమా ఇంకా రిలీజ్ కాలేదు, హీరోలో ఉండాల్సిన క్వాలిటీ ఒక్కటీ అతనిలో లేదు కానీ ఇంటర్నెట్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. చివరికి టాలీవుడ్ సూపర్ హిట్ చిత్రాల డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి గారి దృష్టిని కూడా ఆకర్షించాడు. ఇంతకీ ఎవరతను?

అతనే సంపూర్నేష్ బాబు..

ఇతను ఎవరా అని మీరంతా షాక్ అవ్వచ్చు.. అతను హీరోగా ‘హృదయ కాలేయం’ అనే సినిమా త్వరలో రానుంది. ఈ సినిమాకి ‘ ఎ కిడ్నీ విత్ ఎ హార్ట్’ అనేది ఉపశీర్షిక. అలా అంటే ఎంటనేది మాకు తెలియదు కానీ దీంతో సంపూర్నేష్ బాబు మనముందుకు రానున్నాడు. ఈ రాబోయే హీరోకి అప్పుడే ‘రాష్ట్ర సంపూర్నేష్ యువత’ కూడా ఉంది.
ఈ సినిమాని పేరడీగా కొంతమంది మూవీ లవర్స్ కలిసి నిర్మిస్తున్నారు. చెత్త ఫిల్మ్ మేకింగ్ అంటే ఎలా ఉంటుందా అనే విధంగా సినిమా చేస్తున్నారని సమాచారం. చివరికి సంపూర్నేష్ బాబు తెలుగు సినిమాకి తమిళ్ పవర్ స్టార్ శ్రీనివాసం లాగా అవుతాడా? అనే దాని కోసం మరి కొన్ని రోజులు ఎదురు చూడాలి.

Exit mobile version