హీరో సిద్దార్థ్ వసంతబలన్ దర్శకత్వంలో రానున్న సినిమాలో ఒక ప్రముఖ సింగర్ ఎస్.జి కిట్టప్పగా కనిపించనున్నాడు. ఈ సినిమాకి తమిళంలో ‘కావియ తలైవన్’ గా పేరును నిర్ణయించారు. కానీ తెలుగులో ఇంకా పేరును ఖరారు కాలేదు. ఈ సినిమా కథ 1920లో జరిగింది. స్వాతంత్రానికి ముందు పాపులర్ సింగర్స్ అయిన ఎస్.జి కిట్టప్ప, అతని భార్య కె.బి సుందరంబాల్ కథకి ఇంప్రెస్ అయిన ఆయన ఈ సినిమాని తీస్తున్నాడు. ఇంతకు ముందు వసంతబలన్ ‘షాపింగ్ మాల్’, ‘ఏకవీర’, లాంటి సినిమాలను దర్శకత్వం వహించాడు. ఇప్పుడు కిట్టప్ప, సుందరంబాల్ ల కథని స్క్రీన్ పై చూపించపోతున్నాడు. సిద్దార్థ్ నటిస్తున్న మొదటి పీరియడ్ సినిమా ఇది. ఈ సినిమా ఈ సంవత్సరం చివరిలో విడుదలయ్యె అవకాశం ఉంది. ఈ సినిమాకి ఎ.ఆర్ రహమాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. సిద్దార్థ్ నటిస్తున్న ‘సమ్థింగ్ సమ్థింగ్’ సినిమా జూన్ లో విడుదల కానుంది. ఆ తరువాత కార్తీక్ సుబ్బరాల్ సినిమాలో నటించనున్నాడు.