‘ఏమైంది ఈ వేళ’, ‘సుకుమారుడు’ సినిమాలలో నటించిన కాజల్ అగర్వాల్ చెల్లెలు నిషా అగర్వాల్ ఈ రోజు కంట తడి పెట్టింది. దానికి కారణం ఎవరో కాదు అనాధ పిల్లలు. బిగ్ ఎఫ్. ఎం సంస్థ నిర్వహించిన మాతృదినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా నిషా అగర్వాల్, బుల్లి తెర నటి మధుమణి హాజరయ్యారు. 1000 మంది అనాధ పిల్లలని చేరదీసి ఆశ్రయం కల్పిస్తున్న ‘హెల్పింగ్ సొసైటీ వీకర్ సెక్షన్’ సంస్థ నిర్వాహకురాలు నక్రీభాయి ఈ కార్యక్రమానికి పిల్లలతో సహా హాజరయ్యారు. ఆమె చేస్తున్న మంచి పనికి అందరు అభినందించడమే కాక నిషా అగర్వాల్ కంట తడి కుడా పెట్టారు. ఏదైనా ఒక మంచి పనికి కన్నీళ్ళు బయటకురావడం మంచిదేకదా…