కొత్త ప్రయోగాలు చేస్తూ పేరును సంపాదించుకున్న హీరో మంచు మనోజ్ ప్రస్తుతం ‘పోటుగాడు’ సినిమా షూటింగ్ లో బిజీగా వున్నాడు. ఇప్పటికే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలైయ్యాయి. త్వరలో మనోజ్ ఈ సినిమా డబ్బింగ్ చెప్పనున్నాడు. ఈ సినిమాని జూలై లేదా ఆగష్టులో విడుదల చేయడానికి ప్రొడక్షన్ టీం ప్లాన్ చేస్తున్నారు. సిమ్రాన్ ముండి, నతాలియా కౌర్, సాక్షి లు హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాని రామలక్ష్మీ మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. చక్రి సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకి పవన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా కామెడీ, యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోందని సమాచారం.