మల్టీప్లెక్స్ లలో స్టడీగా ఉన్న ‘గ్రీకువీరుడు’

Greeku Veerudu (1)

‘కింగ్’ నాగార్జున నటించిన ‘గ్రీకువీరుడు’ సినిమా మల్టీప్లెక్స్ లలో,ఓవర్సీస్ లో, ఎ సెంటర్స్ లో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకి ఫ్యామిలీ, మధ్య వయస్సు కల వారు ఎక్కువగా వస్తున్నారు. ఈ సినిమాలో ఫైటింగ్స్, అసభ్యకరమైన సన్నివేశాలు లేవు. కానీ ఈ సినిమా స్టూడెంట్స్, యువకులని అంతగా ఆకర్షించలేకపోయింది. దశరథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించింది. కె. విశ్వనాథ్ గారు నాగార్జున తాతయ్యగా నటించారు. థమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాని కామాక్షి మూవీస్ బ్యానర్ పై శివ ప్రసాద్ రెడ్డి నిర్మించాడు.

Exit mobile version