ఎనర్జిటిక్ పాత్రలో కనిపించనున్న రవితేజ

Balupu

మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న మాస్ మసాలా ఎంటర్టైనర్ ‘బలుపు’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో రవితేజ పాత్ర చాలా ఎనర్జిటిక్ గా, ఎంటర్టైనింగ్ గా ఉంటుందని అంటున్నారు. మామూలుగానే హై ఎనర్జీ లెవల్స్ చూపించడంలో రవితేజకి మంచి పేరుంది, దానిని గోపీచంద్ మలినేని సినిమా కోసం చాలా చక్కాగా వాడుకొంటున్నారు.

ఈ సినిమాలోని కొన్ని సీన్స్ చూసిన వారు ‘ ‘బలుపు’లో మీరంతా పాత రవితేజని చూస్తారని’ అంటున్నారు. ఈ సినిమాలో శృతి హాసన్, అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాతో శృతి హాసన్ తన గ్లామర్ తో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. ప్రసాద్ వి పొట్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. బలుపు సినిమాని జూన్ లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

Exit mobile version