రెండు పాటలు మినహా ‘అడ్డా’ సినిమా చిత్రీకరణ దాదాపు ముగిసింది. సుశాంత్ మరియు షన్వి ప్రధాన పాత్రధారులు. సాయి కార్తిక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చింతలపూడి శ్రీనివాసరావు మరియు ఏ.నాగ సుశీల సంయుక్త నిర్మాణంలో శ్రీ నాగ్ కార్ప్ బ్యానర్ పై తెరకెక్కుతుంది. ప్రస్తుతం సుశాంత్, షన్వి మిగిలిన రెండు పాటల చిత్రీకరణ కోసం స్విట్జర్ ల్యాండ్ లో వున్నారు. ఈ రెండు పాటలను 10 రోజుల్లో పుర్తిచేయ్యలని అనుకున్నారు. దేవ్ గిల్ ఈ సినిమాలో ప్రధాన విలన్. కొన్ని రోజుల క్రితం ఈ చిత్ర ప్రచారగీత ఆవిష్కరణ సందర్భంగా చింతలపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ ”మనుసున్న ప్రతీఒక్కరూ ఈ చినెఅను ఆదరిస్తారు. హీరో పాత్ర చిత్రీకరణలో విభిన్నమైన షేడ్స్ వున్నాయి. తప్పకుండా ఇది సుశాంత్ కెరీర్లో నిలిచిపోయే చిత్రం. మేము మా కృషితో అత్యున్నతంగా తీసామని అనుకుంటున్నాం ‘అని అన్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. జూన్ లో ఈ సినిమా మన ముందుకురానుంది.