దశరథ్ కూడా నాలానే సినిమాలు చేస్తున్నాడు – కె. విశ్వనాథ్

K-Vishwanath
కింగ్ నాగార్జున హీరోగా నటించిన ‘గ్రీకు వీరుడు’ సినిమా గత శుక్రవారం విడుదలై ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటోంది. నయనతార, కె. విశ్వనాథ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకి దశరథ్ డైరెక్టర్. ఈ విజయవంతంగా ప్రదర్శిస్తున్న సందర్భంగా ఈ చిత్ర టీం ఈ రోజు సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి నాగార్జున, కె. విశ్వనాధ్, దశరత్, శివప్రసాద్ రెడ్డి, అనీల్ భండారి తదితరులు హాజరయ్యారు.

నిర్మాత శివ ప్రసాద్ రెడ్డి, డైరెక్టర్ దశరథ్ తమ సినిమాకు అనుకున్నట్టుగానే ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు.

కె. విశ్వనాథ్ మాట్లాడుతూ ‘ దశరథ్ తో మూడు సినిమాలు చేసాను. అతను పూర్ణ కుంభం లాంటి వాడు. అటూ ఇటూ తొనక కుండా దృడమైన నిర్ణయం కలవాడు. చాలా మంది నేను విశ్వనాథ్ గారినే డైరెక్ట్ చేస్తున్నా అనే భావనతో నన్ను డైరెక్ట్ చేస్తారు. కానీ దశరథ్ మాత్రం నా బాడీ లాంగ్వేజ్ ఏంటో తెలుసుకొని దానికి తగ్గట్టుగా చేస్తాడు. అతను కూడా నాలాగే చాలా సున్నితమైన భావోద్వేగాలను చెప్పే సినిమాలు చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని’ అన్నాడు.

నాగార్జున మాట్లాడుతూ ‘ మేము ముందుగా అనుకున్నట్టుగానే ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాని చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా మంది కాల్ చేసి బాంబులు, గొడవలు లేని సినిమా చూసాం అని చెపుతుంటే చాలా సంతోషంగా అనిపించింది. నేను ఈ వయసులో కూడా డాన్సులు ఇంతబాగా చేసాను అంటే దానికి కారణం గణేష్ మాస్టర్. ఎంతో మంచి స్టెప్స్ కంపోజ్ చేసాడు. కె. విశ్వనాథ్ గారితో మళ్ళీ కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉందని’ అన్నాడు.

Exit mobile version