అక్కినేని నాగేశ్వరరావు – దర్శకరత్న దాసరి నారాయణ రావు కాంబినేషన్లో వచ్చిన కుటుంబ కథా చిత్రం ‘ఏడంతస్తుల మేడ’. ఈ సినిమా 1980లో సూపర్ హిట్ చిత్రం గా నిలిచింది. ప్రస్తుతం దాసరి నారాయణరావు ఈ సినిమాకి నాగేశ్వర రావు గారి కుమారుడు అక్కినేని నాగార్జున రీమేక్ చెయ్యాలని ఆలోచిస్తున్నాడు. గత వారమే నాగార్జున నటించిన ‘గ్రీకు వీరుడు’ సినిమా విడుదలైంది. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా చూసిన దాసరి ఎమోషనల్ సీన్స్ కి బాగా కనెక్ట్ అవ్వడంతో వెంటనే నాగార్జున గారికి ఫోన్ చేసి ‘ఏడంతస్తుల మేడ’ సినిమా రీమేక్ చేద్దాం అనుకుంటున్నాను. సిడి పంపిస్తాను ఓ సారి చూసి చెప్పు అన్నారని, త్వరలోనే చూసి నిర్ణయం చెబుతానని నాగార్జున గారు దాసరి గారికి తెలియజేశారు. ఈ విషయాన్ని స్వయంగా నాగార్జున గారే ఈ రోజు సాయంత్రం జరిగిన ‘గ్రీకు వీరుడు’ సక్సెస్ మీట్లో తెలిపారు.
అలాగే నాగార్జున మాట్లాడుతూ ‘ ‘గ్రీకు వీరుడు’ సినిమా షూటింగ్ సమయంలో కళాతపస్వి కె. విశ్వనాథ్ గారు కూడా ఓ సినిమా చేద్దామని అడిగారు. ప్రస్తుతం నేను కొన్ని సినిమాలకు కమిట్ అయ్యాను అవి పూర్తి కాగానే ఆలోచించి ఓ నిర్ణయం తీసుకుందామని తెలిపానని’ అన్నాడు. అన్నీ అనుకున్నట్లుగా గా జరిగితే వచ్చే సంవత్సరంలో ఈ రెండు సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది