మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న ‘బలుపు’ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. ఈ సినిమాని మేలోనే విడుదల చేస్తామని ముందుగా చెప్పడం జరిగింది. కానీ ఈ సినిమా ప్రొడక్షన్ టీం ఈ సినిమా జూన్ లో విడుదలవుతుందని చెబుతున్నారు. శృతి హసన్, అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. పివిపి బ్యానర్ పై ప్రసాద్ వి పొట్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎస్.ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. రవితేజ చాలా రోజుల తర్వాత ఈ సినిమాలో మాస్ లుక్ లో కనిపించనున్నాడు. ఈ సినిమా పూర్తిగా మాస్ ఎంటర్టైనర్ గా ఉండవచ్చునని అబిమానులు భావిస్తున్నారు.