అచ్చ తెలుగు తెలుగమ్మాయి అయిన ‘కలర్స్’ స్వాతి ‘నార్త్ 24 కాతం’ అనే మళయాళ సినిమాకి సైన్ చేసింది. స్వాతికి ఇది రెండవ మళయాళ సినిమా. కొద్ది రోజుల క్రితం పృథ్వి రాజ్ హీరోగా నటిస్తున్న ‘లండన్ బ్రిడ్జి’ అనే సినిమాకి స్వాతిని హీరోయిన్ గా ఎంచుకున్నారు కానీ ఆమెకి డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఆ ఆఫర్ ఆండ్రియా జేరెమియా కి వెళ్ళింది. అనుకోని విధంగా ‘నార్త్ 24 కాతం’ సినిమాకి ముందుగా ఆండ్రియాని అనుకున్నారు కానీ ఆమెకి కి డేట్స్ ఇబ్బంది రావడంతో అదే రోల్ చేసే అవకాశం స్వాతిని వరించింది. ఈ సినిమాలో తను మలయాళంలో చేసిన మొదటి సినిమాలో జోడీ కట్టిన ఫహద్ ఫసిల్ తోనే మరో సారి జోడీ కడుతుండడం విశేషం. అనిల్ రాధాకృష్ణన్ నాయర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. స్వాతి ప్రస్తుతం తమిళ్ లో ‘ఇదార్ఖుతానే ఆసైపట్టై బాలకుమర’ సినిమాలోనూ, తెలుగులో నవదీప్ సరసన ‘బంగారు కోడిపెట్ట’ సినిమాలో నటిస్తోంది.