ఆయనో సినీ దిగ్గజం. వందసంవత్సరాల భారతీయ సినీ చరిత్రను చర్చించుకున్నా, 80 వసంతాలు పూర్తిచేసుకున్న తెలుగు సినిమా ఘనతను ప్రస్తావించాలన్నా ఈయన పేరును తప్పకుండా స్మరణ చేసుకోవాలి. ఆయన ‘తాతామనవడు’, ‘స్వర్గం నరకం’ లాంటి క్లాసిక్స్ నే కాక, ఆడదంటే అబల కాదు శబల అని నమ్మి ‘ఒసేయ్ రాములమ్మా’, ‘అమ్మ రాజీనామా’, ‘ఆదివారం ఆడవాళ్ళకు శెలవు’ వంటి మహిళాప్రాధాన్యత వున్నా సినిమాలను తీసారు. ఎన్.టీ.ఆర్ తో ‘బొబ్బిలి పులి’, ఏ.ఎన్.ఆర్ తో ‘మేఘసందేశం’, చిరంజీవితో ‘హిట్లర్’ వంటి సూపర్ హిట్ సినిమాలను మనకు అందించారు. ముఖ్యంగా ‘మేఘసందేశం’ అంతర్జాతీయ ఖ్యాతిని గనించుకుంది. ఇందులో ఒక్కో పాటా అద్బుతమే. తెలుగు తెరపై తెలుగు హీరొయిన్ లు కనబడాలని తపన పడతారు.
ఆ కారణంతోనే చాలా వరకూ కొత్త తారాగణంతో ‘యంగ్ ఇండియా’ తీసారు. రాజకీయాల్లో కుడా ఆయన ముఖ్య భూమికను పోషించారు. ప్రస్తుతం తెలుగు సినీరంగంలో ఈయన ఒక పెద్దదిక్కు. ఎన్నో మరపురాని చిత్రాలను తీసిన మన కధకుడు, లిరిక్ రైటర్, నిర్మాత, దర్శకరత్న దాసరి నారాయణ రావు గారికి 123తెలుగు ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.