పూర్తికావచ్చిన జంజీర్ చిత్రీకరణ

ramcharan-zanjeer
రామ్ చరణ్ మొదటి హిందీ సినిమా ‘జంజీర్’ చిత్రీకరణ తుదిదశలో వుంది. అమిత్ మెహ్రా నిర్మిస్తున్న ఈ సినిమాకు అపుర్వ లిఖియా దర్శకుడు. దర్శకుడు సినిమా గురించిన విషయాలు చెప్తూ “ఈ సినిమాకు ఆఖరి నాలుగు రోజుల షూటింగ్ మిగిలివుంది. ఇది పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెడతామని”తెలిపారు. కోర్టు తనను లొంగిపొమన్నకా క్రితం వారమే సంజయ్ దత్ తన పాత్ర చిత్రీకరణ ముగించుకుని డబ్బింగ్ కుడా చెప్పేసాడు.
ఈ సినిమాకు మొదటినుండి అన్నీ ఆటంకాలే. కొత్తగా అమిత్ మెహ్రా సోదరులు అన్ని బకాయిలు చెల్లించేదాకా సినిమా ప్రమోషన్ జరపకూడదని కోర్టును ఆశ్రయించారు.
రామ్ చరణ్ , ప్రియాంక చోప్రా, సంజయ్ దత్ మరియు ప్రకాష్ రాజ్ తదితరులు హిందీ వెర్షన్లో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తెలుగులో సంజయ్ దత్ పాత్రను శ్రీ హరి భర్తీ చేసాడు. తెలుగు వెర్షన్ పేరు ‘తూఫాన్’. ఆయిల్ మాఫియా నేపధ్యంలో సాగే ఈ సినిమాలో రామ్ చరణ్ పోలీస్ ఆఫీసర్ గా కనబడనున్నాడు.

Exit mobile version