శ్రీ పవన్ తదుపరి సినిమా ‘కాళీచరణ్’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరిదశలో వుంది. చైతన్య కృష్ణ, చాందిని ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. భోజ్ పురి నటుడు పంకజ్ కేసరి విలన్ గా పరిచయంకానున్నాడు. ఇప్పటికే రీ- రికార్డింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకుంటుంది. 80వ దశకంలో వాస్తవ సంఘటనల నేపధ్యంలో మహబూబ్ నగర్ ఏరియాలో పాలమూర్ ప్రాంతంలో జరిగిన యాధార్ధ కధ ఇది. యాక్షన్ సీన్లు అద్బుతంగా రుపుదిద్దుకున్నాయని సమాచారం. ఈ సినిమాను తక్కువ వనరులతో, కష్టమైన వాతావరణంలో తెరకెక్కించారు. ఈ సినిమాకు శ్రీ పవన్ ఏ నిర్మాత. నందన్ రాజ్ సంగీతం అందించాడు.