ఎన్.టి.ఆర్ – సమంతల ‘రభస’

NTR-and-Samantha
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ – సమంతలు జంటగా బెల్లంకొండ సురేష్ నిర్మించనున్న సినిమాలో నటించనున్నారు. ఈ సినిమాకి సంబందించిన ముహూర్త కార్యక్రమం కొద్ది రోజుల క్రితం జరిగింది. ఈ సినిమాకి వర్కింగ్ టైటిల్ గా ‘రభస’ అని అనుకుంటున్నారు. ఈ టైటిల్ ని ఇంకా అధికారికంగా అనౌన్స్ చెయ్యలేదు కానీ ఇదే టైటిల్ ని ఫిల్మ్ చాంబర్ లో రిజిస్టర్ చేసారు. ‘కందిరీగ’ ఫేం సంతోష్ శ్రీనివాస్ ఈ సినిమాకి డైరెక్టర్. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్న ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ‘రభస’ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా ఉంటుందని ఆశిస్తున్నారు. ప్రస్తుతం హరీష్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమాలో కూడా ఎన్.టి.ఆర్ – సమంత జంటగా నటిస్తున్నారు.

Exit mobile version