హై వోల్టేజ్ డ్రామాపై ఫోకస్ పెట్టిన ఎన్.టి.ఆర్ – హరీష్ శంకర్

NTR-and-Harish-Shankar

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ప్రస్తుతం ‘రామయ్య వస్తావయ్య’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాపై ఎన్.టి.ఆర్ అభిమానులు, మూవీ లవర్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న హరీష్ శంకర్ హీరో హీరోయిజాన్ని బాగా చూపించగల దర్శకుడు. అలాగే మాస్ ఇమేజ్, డైలాగ్స్ డెలివరీ పై పట్టున్న ఎన్.టి.ఆర్ – హరీష్ శంకర్ కాంబినేషన్లో సినిమా అనగానే అందరూ హై వోల్టేజ్ డ్రామా ఉన్న సినిమా అని అంచనా వేస్తారు. ఈ అంచనాలను తెలుసుకున్న ఎన్.టి.ఆర్, హరీష్ శంకర్ లు వారి అంచనాలను నిజం చేయడానికి ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ సినిమాలో ఎన్. టి.ఆర్ డైలాగ్స్ స్పెషల్ హైలైట్ అవుతాయని ప్రొడక్షన్ టీం తెలియజేసింది. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

Exit mobile version