జండాపై కపిరాజుపై దృష్టిపెడుతున్న నాని

Jendapai Kapi Raju
సముధ్రఖని దర్శకత్వంలో ‘జండాపై కపిరాజు’ సినిమాలో నటిస్తున్న నాని ఇప్పుడు ఆ సినిమాపై దృష్టిపెడుతున్నాడు. చెన్నైలో ఇటీవలే మొదలైన కొత్త షెడ్యూల్లో ఈ ద్విభాషా చిత్రం యొక్క ముఖ్యసన్నివేశాలు నాని మీద షూట్ చేసారట. ఇదివరకే ఈ సినిమాలో సన్నివేశాలను హైదరాబాద్, కేరళ, గోవాలలో తీసారు. నాని, అమలాపాల్ జంటగా నటిస్తున్న ఈ సినిమాను వాసన్ విసువల్ వెంచర్స్ బ్యానర్ పై కె.ఎస్ శ్రీనివాసన్ నిర్మిస్తున్నాడు. కృష్ణవంశీ ‘పైసా’ చిత్రీకరణతో ఇప్పటివరకూ బిజీగా ఉన్న నాని ఇప్పుడు ‘జండాపై కపిరాజు’పై పూర్తిగా దృష్టిపెడుతున్నాడు. జి.వి ప్రకాష్ సంగీతం సమకూరుస్తున్నాడు. నాని ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. వృద్ధుడి పాత్రకోసం గుండుతో కనిపించనున్నాడు. నువ్వు మారితే నీ చుట్టూ వున్నా సమాజం కుడా మారుతుందన్న నేపధ్యమే ఈ సినిమా కధ. ఇదే కాక త్వరలో మొదలుకానున్న ‘బాండ్ భజా భారత్’ సినిమా రీమేక్ లో కుడా నానిని మనం చూడొచ్చు.

Exit mobile version