యాక్షన్ 3డి టీం ను ప్రశంసించిన శ్రీను వైట్ల

Action-3d-Sreenu-Vaitla
అనీల్ సుంకర తెరకెక్కిస్తున్న ‘యాక్షన్ 3డి’ సినిమాకు శ్రీను వైట్ల రూపంలో కొత్త ఫ్యాన్ దొరికాడు. శ్రీను వైట్ల ఈ సినిమా మొత్తం చూసి అనీల్ సుంకర మరియు అంతని బృందాన్ని మంచి చిత్రం చేసారని పొగిడాడు. “ఈ రోజు మన డైరెక్టర్ శ్రీను వైట్ల మా సినిమాను చూసారు. సినిమాను తీర్చిదిద్దిన విధానానికి ఆయన చాలా ఆనందపడ్డారు. నేను ఈ విషయాన్ని ఇప్పుడు బయటపెడతున్నాను. నా చిత్రాన్ని తన చిత్రంగా భావించి తగిన జాగ్రత్తలు తీసుకున్న శ్రీను గారికి నా కృతజ్ఞతలు. మీరిచ్చిన సహకారం మరువలేనిదని” ట్వీట్ చేసాడు. యాద్రుచికంగా రామ్ ఆచంట,గోపి చంద్, అనీల్ సుంకర మరియు శ్రీను వైట్ల ‘నమో వెంకటేశ’ మరియు ‘దూకుడు’ సినిమాలకు పని చేసారు. వీరు ముగ్గురూ శ్రీను మహేష్ తో తీస్తున్న ‘ఆగడు’ సినిమాను నిర్మించనున్నారు.

‘యాక్షన్ 3డి’ సినిమాలో అల్లరి నరేష్, వైభవ్ రెడ్డి, శ్యాం, రాజు సుందరం,నీలం ఉపాధ్యాయ్, స్నేహా ఉల్లాల్ మరియు కామ్నా జట్మలాని నటిస్తున్నారు. ఈ సినిమా తమిళ వెర్షన్ పేరు ‘ఓ పోడు’. దీనిలో శింభు, సంతానం మెరవనున్నరు. ఈ సినిమా మే నెల మధ్యలో విడుదల కావచ్చు. సర్వేశ్ మురారి సినిమాటోగ్రాఫర్. ఈ సినిమాకు సంగీతాన్ని బప్పా లహరి- బప్పి లహరి అందించారు.

Exit mobile version