మే 7న విడుదల కానున్న డి.కె.బోస్ ఆడియో

సందీప్ కిషన్ హీరోగా, నిషా అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న సినిమా ‘ డి.కె బోస్’. ఈ సినిమా ఆడియోని మే 7న సందీప్ కిషన్ పుట్టిన రోజున విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని సందీప్ స్వయంగా ట్విట్టర్ లో తెలియజేశాడు. ఈ సినిమాకి సంగీతాన్ని అచ్చు అందిస్తున్నాడు. ఆనంద్ రంగ, శేషు రెడ్డిలు నిర్మిస్తున్న ఈ సినిమాకి బి.ఎస్ బోస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో బ్రహ్మాజీ, కోట శ్రీనివాస రావు, అజయ్ కుమార్, అన్నపూర్ణమ్మ మొదలగు వారు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. యాక్షన్, రోమాన్స్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉంది.

Exit mobile version