యాక్టర్ హర్ష వర్ధన్ కామెడీ సీరియల్ ‘అమృతం’లో తన పెర్ఫార్మెన్స్ తో అందరి మనసును ఆకట్టుకున్నాడు. అలాగే ‘లీడర్’, ‘అనుకోకుండా ఒకరోజు’ లాంటి సినిమాలో కూడా నటించాడు. ఆ సినిమాల ద్వారా అతని టాలెంట్ అంతగా వెలుగులోకి రాలేదు. కానీ ప్రస్తుతం హర్ష వర్ధన్ డిఫరెంట్ రీసన్ తో వెలుగులోకి వచ్చాడు. ఈ మధ్యే విడుదలైన ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాకి తను డైలాగ్స్ అందించాడు. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాదించింది. దానితో అతనికి ఇండస్ట్రీలో మంచి పేరు వచ్చింది. ప్రస్తుతం హర్ష వర్ధన్ అక్కినేని వారసులంతా కలిసి చేస్తున్న మల్టీ స్టారర్ సినిమా ‘మనం’ కి పనిచేస్తున్నాడు. ఈ మద్య జరిగిన ప్రెస్ మిట్ లో హర్ష వర్ధన్ ని ఉద్దేశించి నాగార్జున చెబుతూ ‘చాలా మంది రచయితలు డైరెక్టర్ ల చుట్టూ తిరుగుతూ వుంటారు. కానీ ప్రస్తుతం ఎవరైతే ప్రజల మనసుకు నచ్చేలా డైలాగ్స్ రాయగలరో వారికే డిమాండ్ వుంటుందని’ అన్నాడు. హర్ష వర్ధన్ ఈ రంగంలో విజయాన్ని సాదిస్తాడని ఆశిద్దాం.