కింగ్ నాగార్జున హీరోగా నటించిన ‘గ్రీకు వీరుడు’ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాకి ఎస్.ఎస్ థమన్ అందినచిన ఆడియో సూపర్ హిట్ అవ్వడం తో ఈ హైదరాబాద్లో హెక్సా ప్లాటినం డిస్క్ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి హీరో నాగార్జున, డైరెక్టర్ దశరథ్, నిర్మాత డి. శివప్రసాద్ రెడ్డి, కోనా వెంకట్, విజయ్ మొదలైన వారు హాజరయ్యారు.
నిర్మాత డి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ‘ మా బ్యానర్ – నాగార్జున గారి కాంబినేషన్లో వచ్చిన అన్ని సినిమాలు మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. ‘గ్రీకు వీరుడు’ మ్యూజిక్ హిట్ అయ్యింది. రేపు 3వ తేదీ సినిమా విడుదలై సూపర్ హిట్ అవుతుంది. ఇండియా మొత్తం మీద ఈ వయసులో కూడా నాగార్జున గారంత స్టైలిష్ గా, పర్ఫెక్ట్ గా ఇంకెవ్వరూ ఉండరని’ అన్నాడు.
కోనా వెంకట్ మాట్లాడుతూ ‘ నాగార్జున గారు సినిమాలో చాలా బాగున్నారు. దానికి కారణం ఆయన లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకోరు అందుకే ఆయన ఇంకా కింగ్ లాగా ఉన్నాడని’ అన్నాడు.
నాగార్జున మాట్లాడుతూ ‘ ముందుగా హిట్ మ్యూజిక్ ఇచ్చినందుకు థమన్ కి ధన్యవాదాలు. నేను ఈ సినిమాలో ఇంత స్టైలిష్ గా కనపడుతున్నా అంటే దానికి 50% కారణం సినిమాటోగ్రాఫర్ అనిల్ భండారి. స్టైలిష్ అంటే గుర్తొచ్చింది షూటింగ్ టైంలో నేను మర్చిపోలేని సంఘటన ఒకటి జరిగింది. అదేమిటంటే ఈ సినిమాలో రష్యన్ గర్ల్స్ తో కలిసి పని చేసాను చాలా రోజులు షూటింగ్ అయిన తర్వాత వారికి నా వయసు 53 సంవత్సరాలు అని తెలియడంతో షాక్ అయ్యారు. వాళ్ళంతా వచ్చి మీ వయసు 30 సంవత్సరాలు అనుకున్నాం కానీ మీ వయసు చాలా ఎక్కువ. మీరు ఈ వయసులో కూడా చాలా అందంగా ఉన్నారని కాంప్లిమెంట్ ఇచ్చారు. అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. చివరిగా ‘గ్రీకు వీరుడు’ సినిమా దశరథ్ స్టాంప్ తో ఈ హాట్ సమ్మర్లో వస్తున్న కూల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్.. చూసి ఎంజాయ్ చెయ్యండని’ అన్నాడు.