కమెడియన్ వేణు మాధవ్ పై క్రిమినల్ కేసు.!

Venu-Madhav

తెలుగు ఇండస్ట్రీలో బాగా ప్రాచుర్యం ఉన్న కమెడియన్ వేణు మాధవ్ పై హైదరాబాద్లో నిన్న క్రిమినల్ కేసు నమోదైంది. కుషాయిగూడాలో వేణు మాధవ్ పెంచుకునే కుక్క ఒక చిన్న పిల్లాన్ని కరిచింది. ఆ బాలుడి నాన్నగారు నిన్న కుషాయిగూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. వేణుమాధవ్ ప్రతిరోజూ తన పెంపుడు కుక్కను తీసుకొని అలా వాకింగ్ కి వెళుతుంటాడు. ఇంతలో ఈ సంఘటన జరగడంతో పెంపుడు జంతువులను విచ్చల విడిగా వదిలేసిన కారణంగా ఐపిసి 289 సెక్షన్ ప్రకారం అతని పై కేసు ఫైల్ చేసారు. ఇది వరకూ ఈ విషయంపై వేణు మాధవ్ ఎలాంటి కామెంట్ చెయ్యలేదు.

Exit mobile version