ఈరోజు వైభవంగా జరగనున్న గ్రీకువీరుడు ప్లాటినం డిస్క్ ఫంక్షన్

Greeku-Veerudu
నాగార్జున, నయనతార జంటగా నటిస్తున్న ‘గ్రీకువీరుడు’ సినిమా మే 3వ తేదిన విడుదలకు సిద్దమయ్యింది. దశరధ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను కామాక్షి మూవీస్ బ్యానర్ ద్వారా డి శివప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందించగా ఇప్పటికే పాటలకు మంచి స్పందనవచ్చింది. ఈ ఆడియో అందించిన విజయాన్ని జరుపుకోవడానికి నాగార్జున ఈరోజు మల్టీప్లెక్స్ లో హెక్సా ప్లాటినం డిస్క్ ఫంక్షన్ నిర్వహించనున్నారు.

నాగార్జున మీడియాతో మాట్లాడుతూ ‘థమన్ వినసొంపైన బాణీలను అందించాడు. సాహిత్యం కుడా బాగుంది. నా వరకూ ‘ఐ హేట్ లవ్ స్టోరీస్’ పాట అత్యంత ప్రజాదరణ పొందింది. చాలా మంది కాలర్ ట్యూన్స్ గా కుడా ఈ పాటనే డౌన్ లోడ్ చేసుకున్నారని’ అన్నారు. అనీల్ భండారి సినిమాటోగ్రాఫర్.
ఈవెంట్ మేనేజర్ గా పని చేస్తూ మొదటిసారిగా ఇండియా వచ్చి ప్రేమలో పడిన పాత్రలో నాగార్జున కనపడనున్నారు.

Exit mobile version