ఇలియానా ఇప్పుడు బాలీవుడ్లో ఫుల్ స్వింగ్ లో వుంది. మరొక్క హిట్ ఆమె ఖాతాలో చేరితే ఇంక అక్కడ ఆమెకు తిరుగుండదు. ‘బర్ఫీ’ సినిమాతో అక్కడి వారకి పరిచయమైన ఈ భామ ఈ మధ్యే షాహిద్ కపూర్ కు జంటగా ‘ఫటా పోస్టర్ నికలా హీరో’ అనే సినిమాను అంగీకరించింది. ఏక్తా కపూర్ తన సినిమాలో ఒక ముఖ్య పాత్రకు ఇలియానాను సంప్రదించాడని వార్తలు కూడా ఈ మధ్యే వచ్చాయి. ఇప్పుడు తాజా వార్త ఏంటంటే ఇలియానా సైఫ్ ఆలీఖాన్ సరసన కనపడనుందట. ఈ సినిమాకు రాజ్ మరియు డి.కె దర్శకులు. దర్శకులతో పాటూ హీరో గారు కుడా ఇలియానా వైపు మగ్గుచూపుతున్నారట. ఈ దర్శకద్వయం ఇప్పటివరకూ ‘ఫ్లేవర్స్’,’99 అండ్ ది షోర్ సిటీ’ తీసారు. వీరి తాజా సినిమా ‘గో గోవా గాన్’ విడుదలకు సిద్దంగావుంది. ఇలియానా హిందీ సినిమాలో నటించనప్పటినుండీ ఇప్పటివరకూ ఒక్క తెలుగు సినిమాగానీ, తమిళ సినిమాగానీ ఒప్పుకోలేదు.