మొదలైన తెలుగు కహానీ

Nayanathara-and-Shekhar-Kam
‘కహానీ’ సినిమా యొక్క తెలుగు రీమేక్ ఎట్టకేలకు హైదరాబాద్లో మొదలైంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నయనతార ప్రధాన పాత్ర పోషించనుంది. ఈ సినిమా గత ఏడాది హిందీలో విద్యాబాలన్ నటించిన ‘కహానీ’ సినిమాకు రీమేక్. ఈ సినిమా అక్కడ విమర్శకుల ప్రశంసలే కాక డబ్బులు కూడా సంపాదించిపెట్టింది. ఈ సినిమాను ఎండెమోల్ ఇండియా, లొంగ్లిన్ ప్రొడక్షన్స్ మరియు సెలెక్ట్ మీడియా హోల్డింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఓల్డ్ సిటీని తలపించే విధంగా ఒక భారీ సెట్ ను హైదరాబాద్లో నిర్మించారు. ఈ సినిమాలో చాలా భాగం చిత్రీకరణ అక్కడే జరుగుతుంది. వార్తల ప్రకారం సినిమాలో నయనతార పేరు అనామిక అంట. శేఖర్ కమ్ముల సినిమాకు ముందు చేసిన గ్రౌండ్ వర్క్ చూసి నయన్ చాలా హ్యాపీగా వుందంట. ఈ సినిమా తెలుగులోనేకాక తమిళ్ లో కూడా విడుదలకానుంది. ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు.

Exit mobile version