ఘోరమైన ప్రారంభాన్ని అందుకున్న షాడో

Shadow (2)
విక్టరీ వెంకటేష్ హీరోగా నటించన యాక్షన్ ఎంటర్టైనర్ ‘షాడో’. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగాచాలా ఘోరమైన ప్రారంభాన్ని అందుకుంది. ఈ సినిమాకి మెహర్ రమేష్ డైరెక్టర్. అతని డైరెక్షన్ చాలా పూర్ గా ఉండటం ఈ సినిమా వైఫల్యానికి మొదటి కారణంగా చెప్పుకోవచ్చు.

కొంతవరకూ అంచనాలు ఉండడంతో సినిమా భారీగానే విడుదలైంది. కానీ ప్రస్తుతం అందరి డిస్ట్రిబ్యూటర్స్ నుండి నెగటివ్ రిపోర్ట్స్ వచ్చాయి. వారందరికీ నష్టాలు తెచ్చిపెట్టిన ఈ మూవీని వారు అంట త్వరగా మర్చిపోలేరు. అత్యంత భారీ బడ్జెట్ తో పరుచూరి శివారం ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ కంపోజ్ చేసాడు.

Exit mobile version