కొరియోగ్రాఫర్, డైరెక్టర్ రాఘవ లారెన్స్ దర్శకత్వం వహిస్తూ నటిస్తున్న ‘ముని-3’ సినిమా షూటింగ్ చెన్నైలో శరవేగంగా జరుగుతోంది. ఈ హర్రర్ కామెడీ సినిమాలో లారెన్స్ సరసన తాప్సీ హీరోయిన్ గా నటిస్తోంది. బెల్లంకొండ సురేష్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి బయటకి ఎలాంటి న్యూస్ రాకుండా లారెన్స్ చాలా సైలెంట్ గా సినిమాని తీస్తున్నారు. ఈ సినిమాలోని ఎక్కువ భాగాన్ని చెన్నై, అలాగే పరిసర ప్రాంతాల్లో షూట్ చేసారు. ఇటీవలే తిరుమలలో కనిపించిన లారెన్స్ చాలా కాలంగా బయట ఎక్కడా కనపడకుండా ఉంటున్నాడు. ముని సీరీస్ లో వస్తున్న మూడవ పార్ట్ ముని-3. దీనికి ముందు వచ్చిన ‘కాంచన’ సినిమా పెద్ద హిట్ అయ్యింది. ప్రస్తుతం చేస్తున్న పార్ట్ దానికన్నా గ్రాండ్ గా ఉండాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ హర్రర్ కామెడీ సినిమాకి అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.