కొద్ది రోజుల క్రితం తెలుగు సినిమా ఇండస్ట్రీ నష్టాల్లో నడుస్తోందని ఇండస్ట్రీ పెద్దలందరూ కలిసి థియేటర్స్ లో టికెట్ ధరలు పెంచాలని ప్రభుత్వానికి లేఖని సమర్పించారు. ఈ విషయంపై నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఈ రోజు మూవీ టికెట్ ధరలు పెంచుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ జీవో లో ‘ థియేటర్స్ ని 5 విభాగాలుగా(మల్టీ ప్లెక్స్, సిటీ థియేటర్స్, టౌన్ థియేటర్స్ మొదలైనవి) విభజించారు. ఈ విషయంలో ఎలాంటి నిర్ణయాన్ని అయినా తీసుకునే పూర్తి అధికారాన్ని జిల్లా కలెక్టర్స్ కి ఇచ్చారు. ఇక నుంచి ఇప్పుడున్న టికెట్ల ధరపై మరో 20% పెంచనున్నారు. అన్ని థియేటర్లలోనూ ఇదేవిధంగా పెరిగే అవకాశం లేదు. థియేటర్లలో ఉన్న వసతులను, నిర్వహణను బట్టి టికెట్ ధరను పెంచుతారని’ ఇచ్చారు.
మల్టీ ప్లెక్సుల్లో ప్రస్తుతం టికెట ధర రూ.150/- ధరలు పెరిగితే రూ. 200/- అయ్యే అవకాశం ఉంది. అలాగే హైదరాబాద్ సిటీలో ప్రస్తుతం రూ 55/- తో నడుస్తున్న బాల్కనీ టికెట్స్ ధర రూ 75/- కి పెరిగే అవకాశం ఉంది. ఆయా జిల్లాల్లోని థియేటర్ యజమానులు కలిసిచరచాలు జరిపిన తర్వాత కొత్త టికెట్ ధరలు ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయో తెలుస్తుంది.