‘విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ‘షాడో’ సినిమా రేపు భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ఈ సినిమా బిగ్గెస్ట్ సమ్మర్ ఎంటర్టైనర్ అని డైరెక్టర్ మెహర్ రమేష్ నిన్న మీడియా తో జరిగిన ప్రెస్ మీట్లో తెలిపాడు. ” నేను వెంకటేష్ గారిని మాస్ రోల్ లో చూడాలనుకున్నాను. ‘ధర్మక్షేత్రం’, ‘శత్రువు’ మొదలైన సినిమాల్లో చాలా బాగుంటారు. ఎలాంటి పాత్రైనా చెయ్యగల విలక్షణ నటుడు వెంకటేష్ కానీ నేను మాత్రం ఆయన్ని పూర్తి మాస్ పాత్రలో చూపించాలనుకున్నాను. కావున ‘షాడో’ లో ఎంత వరకూ వీలైతే అంతవరకూ మాస్ లుక్లో చూపించడానికి ప్రయత్నించానని’ అన్నాడు. వెంకీ సరసన తాప్సీ జోడీ కట్టిన ఈ సినిమాకి థమన్ సంగీతాన్ని అందించాడు. వెంకటేష్ కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాని పరుచూరి కిరీటి నిర్మించాడు. శ్రీకాంత్, మధురిమ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.