మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న ‘పోటుగాడు’ సినిమా చాలా ఫాస్ట్ గా షూటింగ్ చేస్తున్నారు. ఈ సినిమాని జూలై ఆగష్టులో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలు పెట్టారు. ఇప్పటివరకూ షూటింగ్ అయిన భాగానికి ఎడిటింగ్ చేయడం మొదలు పెట్టేసారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కర్ణాటకలో జరుగుతోంది. సిమ్రాన్ ముండి కౌర్, నథాలియా కౌర్, సాక్షి లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రామలక్ష్మి మూవీస్ బ్యానర్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి పవన్ డైరెక్టర్. చక్రి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి శ్రీధర్ సీపన డైలాగ్స్ రాస్తున్నారు. ఈ సినిమా మంచి కామెడీతో సాగే యాక్షన్ ఎంటర్టైనర్ అవుతుందని అంచనా వేస్తున్నారు.