గుణ శేఖర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న హిస్టారికల్ డ్రామా ‘రుద్రమ దేవి’. ఈ సినిమా ప్రొడక్షన్ కార్యక్రమాలను మొదలుకానున్నాయి. డైరెక్టర్ ఈ సినిమా కోసం కొత్త కొత్త నటులను వెతుకుతున్నారు. ఈ సినిమాలో రానా దగ్గుపాటి , అనుష్క, విలక్షణ నటుడు కృష్ణం రాజు, బాబా సెహగల్ లు నటిస్తున్న విషయం మనకు తెలుసు. ఇప్పుడు ఈ టీంలో అదితి చెంగప్ప కొత్తగా చేరింది. ఈమె కొన్ని సంవత్సరాలకు ముందు తెలుగు సినిమా ‘తకిట తకిట’ లో కనిపించింది. ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాలో అదితి గణపంబ పాత్రలో రుద్రమ దేవి చెల్లెలిగా కనిపించనుంది. ఈ సినిమాని 3డిలో గుణ శేఖర్ సొంతంగా నిర్మిస్తున్నాడు. ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకి తోట తరణి ఆర్ట్ డైరెక్టర్. అజయ్ విన్సెంట్ ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నాడు.