ప్రస్తుతం వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం అక్కినేని నాగచైతన్య ‘తడాఖా’ ఆడియో లాంచ్ వేడుకకి ముఖ్య అతిధిగా విక్టరీ వెంకటేష్ రానున్నాడు. రేపు సాయంత్రం హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో జరగనున్న ఈ వేడుకకి చాలా మంది స్టార్స్ రానున్నారు. వెంకటేష్ గారు వస్తున్నారు అనే విషయాన్ని ఇంకా అధికారికంగా తెలియజేయలేదు కానీ నాగ చైతన్య వెంకటేష్ మేనల్లుడు కావడం వల్ల ఎక్కువ భాగం వచ్చే ఛాన్స్ లు కనపడుతున్నాయి.
‘తడాఖా’ సినిమాలో నాగ చైతన్య, సునీల్, తమన్నా, ఆండ్రియా జెరేమియా కీలక పాత్రల్లో నటించారు. డాలీ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి బెల్లంకొండ సురేష్ నిర్మాత. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా తమిళంలో హిట్ అయిన ‘వేట్టై’ సినిమాకి రీమేక్. ఈ సినిమాలో నాగ చైతన్య, సునీల్ అన్నాదమ్ములుగా కనిపించనున్నారు.