First Posted at 23:00 on Apr 22nd
తమన్నా తన తీరికలేని పని నుండి కాస్త విరామం కోరుకుంటుంది. వాళ్ళ పరివారంతో కలిసి ఈ మే మొదట్లో 3 వారాల సెలవులకి అమెరికా వెళ్లనుంది. గత కొన్ని నెలలుగా తీరికలేని షూటింగ్ తో బిజీ అయిపోవడమే కాక బాలీవుడ్లో హిమ్మత్ వాలా సినిమాకి ప్రచారం కోసం సమయం కేటాయించింది. ఒక ప్రముఖ వార్తా పత్రికకు ఇచ్చిన సమాచారం ప్రకారం “నేను నా ఫ్యామిలీతో గడపడానికి చాలా ప్రయత్నిస్తున్నాను, కానీ కుదరడంలేదు. ఎందుకంటే నేను ముందుగానే ఒప్పుకున్న కొన్ని సినిమాలే దానికి కారణం. ఈ సంవత్సరం ఆ షూటింగ్‌లన్నీ ముగించుకుని కాస్త పెద్ద టూర్ కి వెళ్తున్నానని”చెప్పింది.
ఆ టూర్ తరువాత అజిత్ సరసన సినిమాకుగాను రాజమండ్రిలో షూటింగ్లో పాల్గోనుంది. ‘తడాఖా’ చిత్రం ద్వారా తను ఈ మేలో మన ముందుకిరానుంది. ఇదేకాక వి.వి వినాయక్ దర్శకత్వంలో సినిమాలో కుడా నటిస్తుంది.