నేడే ‘యాక్షన్ 3డి’ ఆడియో విడుదల

First Posted at 11:10 AM on Apr 22nd

Action-3d

కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘యాక్షన్ 3డి’. ఈ సినిమా ఆడియోని ఈ రోజు సాయంత్రం ప్రసాద్ మల్టీప్లెక్స్ లో లాంచ్ చేయనున్నారు. దీనిలో బాగంగా ఈ ఆడియో లాంచ్ కి వచ్చే ప్రముఖుల కోసం ఈ సినిమా ఫస్ట్ టీజర్ ని చూపించాడని వేదికని సిద్దం చేశారు. దీనికోసం 3డి గ్లాసెస్ ని, 3డి ప్రొజెక్టర్ ని ఏర్పాటు చేశారు. ఈ ఆడియో లాంచ్ కి ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది ప్రముఖులు హాజరుకానున్నారు. బప్పి లాహిరి అయన కుమారుడు బప్పా లహరి లు ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇండియాలోనే మొదటి 3డి కామెడీ సినిమా ఇది. ఈ సినిమాకి అనిల్ సుంకర దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్నాడు. వైభవ్, ‘కిక్’ శ్యాం, రాజు సుందరం లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో స్నేహ ఉల్లాల్, నీలం ఉపాధ్యాయ్, కామ్న జఠ్మలాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ‘ఈగ’ ఫేం సుదీప్ ఈ సినిమాలో అతిధి పాత్రలో కనిపించనున్నాడు.

Exit mobile version