ఆ చిత్రంతో వారిద్దరి దశతిరగనుందా??

First Posted at 09:20 on Apr 21st

Dashatirigindi

ఒకప్పుడు కామెడీ క్యారెక్టర్లకు పెట్టింది పేరైన నటుడు శివాజీ. దర్శకుడు తేజ వల్ల ఒకానొక టైంలో అగ్రతారగా వెలిగిన నటి సదా. వీరిద్దరూ ఇప్పుడు లైం లైట్లో లేరు. వరుస ఫ్లాపులతో ప్రేక్షకుల దృష్టినుండి దూరమయ్యారు. అయితే ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పుడు ఒక చిత్రం రూపుదిద్దుకుంటుంది. ‘దశతిరిగింది’ అనేది ఈ సినిమాకు టైటిల్. ఈ సినిమా ఆర్.ఆర్ సినీ పిక్చర్స్ బ్యానర్ పై సి.హెచ్.వీ.ఎస్.ఎన్ బాబ్జీ, రత్నమయ్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నీలేష్ కె దర్శకత్వం వహించారు. ఈ చితం లోగో మరియు ట్రైలర్ లాంచ్ శనివారం ప్రసాద్ లాబ్స్ లో జరిగింది.
ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ “సదా ఇటువంటి క్యారెక్టర్ మునుపెన్నడూ చెయ్యలేదు. ఆమెలో ఉన్న హిడెన్ టాలెంట్ ఈ సినిమా ద్వారా బయటపడుతుంది. చాలా కష్టమైన సన్నివేశాలని కుడా ఎటువంటి పెయిన్ కనబడకుండా నటించగలగింది. శివాజీ యాక్టింగ్ స్టైల్ నాకు చాలా ఇష్టం. నిర్మాతల సహాయం మరువలేనిదని” అన్నారు. ఈ సినిమాను మే ప్రధమార్ధంలో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Exit mobile version